1.Research / పరిశోధన 1. Introduction

📚 Research / పరిశోధన

  • 1. Introduction / ముందుమాట
  • 2. History of the Period / కాలము చరిత్ర
  • 3.  Buddha / బుద్ధుడు
  • 4. Political Systems / రాజకీయ వ్యవస్థలు
  • 5. Indigenous Sources / స్వదేశీ ఆధారాలు
  • 6. Literary Works / సాహిత్య గ్రంథాలు
  • 7. Folk Traditions / జానపద సంప్రదాయాలు
  • 8. Oral Literature / వాచిక సాహిత్యం
  • 9. Historical Texts / చరిత్ర గ్రంథాలు
  • 10. Foreign Sources / విదేశీ ఆధారాలు
  • 11. Comparative Philosophical Studies / తులనాత్మక తాత్విక పరిశోధనలు
  • 12. Foreign Travellers / విదేశీ యాత్రికులు
  • 13. Archaeological Sources / పురావస్తు ఆధారాలు
  • 14. Stupas / స్తూపాలు
  • 15. Temples / దేవాలయాలు
  • 16. Sculptural Architecture / శిల్పకళా నిర్మాణాలు
  • 17. Historical Remains / చారిత్రక అవశేషాలు
  • 18. Inscriptions / శాసనాలు
  • 19. Royal Inscriptions / రాజుల శాసనాలు
  • 20. Religious Propagation Inscriptions / మత ప్రచార శాసనాలు
  • 21. Language Development Evidence / భాషా వికాసానికి సంబంధించిన ఆధారాలు
  • 22. Coins / నాణెములు
  • 23. Written Literary Sources / లిఖిత సాహిత్య ఆధారాలు
  • 24. Religious Literature / మత సాహిత్యం
  • 25. Secular Literature / లౌకిక సాహిత్యం
  • 26.others/ఇతరములు 

#Research #పరిశోధన #History #Philosophy #IndianHistory #TeluguResearch

01.intetduction

🪷 బుద్ధుడు మరియు ఆయన తత్వం

Research book on Buddha Philosophy of buddha 
Concept : Human Relations & Human Resources Development


1. చరిత్ర

1.1 బుద్ధుని కాల చరిత్ర

  • బుద్ధుడు క్రీ.పూ. 563లో లుంబినిలో జన్మించాడు.
  • శాక్య వంశానికి చెందినవాడు.
  • క్రీ.పూ. 6వ శతాబ్దంలో మత, సామాజిక మార్పుల కాలం.
  • వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాలు, మూఢనమ్మకాలపై విమర్శనాత్మక దృక్పథం పెరిగిన సమయం.

1.2 స్వదేశీ ఆధారాలు

  • త్రిపిటకాలు
  • జాతక కథలు
  • బుద్ధచరితం
  • దీపవంశ, మహావంశ గ్రంథాలు
  • బౌద్ధ సంఘ సంప్రదాయాలు

1.3 విదేశీ ఆధారాలు

  • చైనా యాత్రికుల గ్రంథాలు
  • టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలు
  • శ్రీలంక బౌద్ధ వృత్తాంతాలు
  • గ్రీకు రచయితల సూచనలు

2. విదేశీ యాత్రికులు

  • ఫాహియాన్ — బౌద్ధ విహారాలు, విద్యా కేంద్రాల వివరాలు.
  • హ్యూయెన్ సాంగ్ — నాళంద విశ్వవిద్యాలయం, బౌద్ధ ధర్మ స్థితిగతులు.
  • ఇట్సింగ్ — బౌద్ధ విద్యా విధానాలపై సమాచారం.

3. పురావస్తు ఆధారాలు

  • సాంచీ స్తూపం
  • భార్హుట్ స్తూపం
  • అమరావతి స్తూపం
  • నాగార్జునకొండ అవశేషాలు
  • బౌద్ధ విహారాలు, చైత్యాలు

4. శాసనాలు

  • అశోకుని శిలాశాసనాలు
  • ధర్మ ప్రచార శాసనాలు
  • బ్రాహ్మీ లిపిలో బౌద్ధ సందేశాలు
  • సారనాథ్, లుంబిని శాసనాలు

5. నాణెములు

  • కుషాణుల నాణేల్లో బుద్ధుని ప్రతిమలు
  • ఇండో-గ్రీకు రాజుల బౌద్ధ చిహ్నాలు
  • ధర్మచక్రం, సింహ చిహ్నాలు

6. సాహిత్య ఆధారాలు

6.1 మత సాహిత్యం

  • త్రిపిటకాలు
  • ధమ్మపదం
  • మిలింద పంహా
  • లలిత విస్తర

6.2 లౌకిక సాహిత్యం

  • బాణభట్టుని రచనలు
  • రాజతరంగిణి
  • ఆధునిక తాత్విక విశ్లేషణలు
  • సామాజిక సంస్కరణ ఉద్యమ గ్రంథాలు

#బుద్ధుడు #Buddha #BuddhistPhilosophy #బౌద్ధం #ప్రతీత్యసముత్పాదం #HumanRelations #ResearchNotes #TeluguGK #IndianPhilosophy

01.intetduction

📚 చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు

Research Book on Philosophers
Concept: Development of Human Relations & Human Resources


📖 తాత్వికులు పరిశోధన అంశాలు

  • కాలము చరిత్ర
  • కాలంనాటికి ప్రపంచ చరిత్ర
  • విదేశీ యాత్రికులు
  • పురావస్తు ఆధారాలు
  • శాసనాలు
  • నాణెములు
  • సాహిత్య ఆధారాలు
  • మత
  • లౌకిక
  • స్వదేశీ
  • విదేశీ

🖋️ ముందుమాట

వస్తు భావ పరంపర భావన. ఈ భావన ప్రగతికి మూలం. జ్ఞాన మనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం.

సమాజం వసుదైక కుటుంబం నమూనా. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్ర పరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

తాత్వికుల భావాలు, భావజాలాలు మనమధ్య వారిని సజీవంగా ఉంచుతాయి.

— Chinta Ramamohan

🌍 Famous Quote

"There are no facts, only interpretations."

— Friedrich Nietzsche (1844–1900)

✍️ Famous Poetry

అజ్ఞానపు అంధయుగంలో ఆకలిలో, ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక పిచ్చి మొసాను

— శ్రీ శ్రీ

🌟 చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు

  • బుద్ధుడు (563–483 BCE) — ప్రతీత్య సముత్పాదం, కార్య కారణత్వం, గతి తార్కిక భౌతిక వాదం.
  • సోక్రటీస్ (469–399 BCE) — “నిన్ను నీవు తెలుసుకో”, సత్యాన్వేషణ పద్ధతి.
  • స్పార్టకస్ (71 BCE) — చరిత్రలో తొలి విప్లవకారుడు, తిరుగుబాటు చిహ్నం.
  • జీసస్ — మానవ సంబంధాలు, సేవాభావం, ప్రేమ మరియు క్షమ.
  • వేమన (1650 – రాయలసీమ) — భావ విప్లవం, ప్రజల భాషలో సామాజిక చైతన్యం.
  • కారల్ మార్క్స్ (1818–1883) — చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం, కమ్యూనిజం.
  • ఫ్రాయిడ్ (1856–1939) — మనోవిశ్లేషణ, అవచేతన మనస్సు, వ్యక్తిత్వ విశ్లేషణ.
  • లెనిన్ (1872–1924) — పెట్టుబడిదారీ విధానం యొక్క అంత్య దశ సాంబ్రాజ్యవాదం.
  • స్టాలిన్ (1879–1953) — రాజ్యరహిత సమాజ భావన, కమ్యూనిజం.
  • మావో (1893–1976) — సాంస్కృతిక విప్లవం, కమ్యూనిజం.

🌱 మానవ సంబంధాలు & మానవ వనరుల అభివృద్ధి

CONCEPT : Development of Human Relations and Human Resources


#తాత్వికులు #Philosophers #HumanRelations #HumanResources #చారిత్రికగతి #వేమన #బుద్ధుడు #సోక్రటీస్ #KarlMarx #TeluguLiterature

02.ప్రపంచ చరిత్ర మతాలు సమాంతర కాలరేఖ

🌍 ప్రపంచ చరిత్ర మతాలు సమాంతర కాలరేఖ 

(Parallel History View)
వివిధ మతాలు, తాత్విక భావజాలాలు ఒకదానితో ఒకటి సమాంతర కాలాలలో అభివృద్ధి చెందాయి.


🟤 జరోస్త్రియన్ యుగం

క్రీ.పూ. 1800 – 1200

మంచి – చెడు మధ్య నైతిక ద్వంద్వ భావనకు ఆది రూపం.

🟡 ఈజిప్టు నాగరికత (సమాంతర ప్రారంభ నాగరికత)

క్రీ.పూ. 3000 – 30

పిరమిడ్లు, ఫరో రాజ్యపాలన, మరణానంతర జీవితం పై విశ్వాస వ్యవస్థ.

🟠 వేద కాలం (ప్రారంభ తాత్విక భావాల సమకాలం)

క్రీ.పూ. 1500 – 500

వేదాలు, యజ్ఞకర్మలు, ధర్మ భావనకు పునాది.

🔵 యూదు మతం (దీర్ఘకాలిక నిరంతర సంప్రదాయం)

క్రీ.పూ. 1200 – ప్రస్తుతం

ఏకేశ్వరవాద భావన అభివృద్ధి.

🟣 గ్రీకు తాత్విక యుగం

క్రీ.పూ. 800 – 146

నైతికత, ప్రశ్నించే తత్వం, తర్కశక్తి వికాసం.

🟢 బౌద్ధ – జైన సంస్కరణ యుగం (భారతదేశం)

క్రీ.పూ. 600 – 300

బౌద్ధం → మధ్యమ మార్గం, నాలుగు ఆర్య సత్యాలు.
జైనం → అహింస, స్వీయ నియంత్రణ, తపస్సు.

🔴 క్రైస్తవ మతం

క్రీ.శ. 1వ శతాబ్దం – ప్రస్తుతం

ప్రేమ, క్షమ, విమోచన భావనలు.

⚫ ఇస్లాం

క్రీ.శ. 7వ శతాబ్దం – ప్రస్తుతం

ఏకేశ్వరవాదం, న్యాయం, క్రమశిక్షణ.

📌 ముఖ్య అవగాహన

ఈ మతాలు, తాత్విక సంప్రదాయాలు వేరువేరుగా కాకుండా కాలం మరియు భౌగోళిక పరిధిలో పరస్పరం సమాంతరంగా అభివృద్ధి చెందాయి. ఒక భావజాలం ఎదుగుతున్నప్పుడు, మరొకటి కొనసాగింది లేదా రూపాంతరం చెందింది.

  • ప్రాచీన నాగరికతలు (ఈజిప్టు) → ప్రారంభ విశ్వాస వ్యవస్థలు
  • తాత్విక విప్లవాలు (గ్రీకు, భారతదేశం)
  • ఏకేశ్వరవాద విస్తరణ (యూద మతం → క్రైస్తవం → ఇస్లాం)

🌏 మానవ చరిత్ర అనేది పరస్పర ప్రభావాలు, భావజాల మార్పులు, మరియు జ్ఞాన పరంపరల సమ్మేళనం.

02.బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం

బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం

బుద్ధుడు (563 - 483 BCE) ప్రతిత్యసముత్పాద,పటిచ్చసముప్పద (కార్యకారణత్వం ) (ఒక దాని కారణంగా మరొకటి జరగడం)

(గతి తార్కిక భౌతికవాదం )

తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం,స్వీయ ప్రభోదాన్ని పొందాడు ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు.

తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి. తన ముందు తరం యొక్క భావాల భావజాలాల నుండి భావజాలాన్ని గ్రహించి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి,తరువాత తరాల తాత్వికులకు, తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధి గా నిలిచాడు.

1. బుద్ధుని కాలము బుద్ధుని చరిత్ర
బౌద్దప్రవక్త గౌతమబుద్ధుడు. గౌతముడు క్రీస్తుపూర్వం 563 నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలోని లుంబినీలో క్షత్రియ వంశంలో జన్మించాడు. 483 లో నిర్యాణము పొందాడు. గౌతమ బుద్ధుడు శాంతి, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ దూత. బుద్ధుడు వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. అనేక ఏళ్లపాటు కఠోర తపస్సు చేసాడు. చివరకు భోది వృక్షమూలంలో కుర్చుని జ్ఞానం సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా రూపొందింది. ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు తన 29వ ఏటనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తరువాత పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణము పొందాడు.

2. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీ.పూ. 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 22 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే 'బుద్ధ గయ' అనే పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుదిశ్వాస విడిచాడు.

3. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థ గౌతమ్. అతను కపిలవస్తు రాజ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి శుద్ధోధనుడు, పాలకుడు. గౌతమ్ తల్లి మాయా దేవి అతనికి జన్మనిచ్చిన వెంటనే మరణించింది. అతను విశాలమైన మనస్సుతో ఆలోచించే పిల్లవాడు. అతను చాలా క్రమశిక్షణ గలవాడు మరియు సమకాలీన భావనలను అర్థం చేసుకోవడానికి మరియు మరింత జ్ఞానాన్ని సేకరించడానికి ప్రశ్నించడానికి ఇష్టపడేవాడు. అతను తన జీవితాన్ని ఆధ్యాత్మికత మరియు ధ్యానం కోసం అంకితం చేయాలనుకున్నాడు. ఇది అతని తండ్రికి నచ్చలేదు. అతను ఆధ్యాత్మికతను కనుగొనడానికి తన తండ్రి కోరికలకు విరుద్ధంగా వెళ్ళాడు. అతను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, గౌతమ్ అద్భుతమైన అందం కలిగిన యువరాణి యశోధరను వివాహం చేసుకున్నాడు. వారికి 'రాహుల్' అనే కొడుకు ఉన్నాడు. సిద్ధార్థ కుటుంబం పూర్తి మరియు సంతోషంగా ఉన్నప్పటికీ, అతనికి శాంతి లేదు. గోడలకు అవతల ఉన్న సత్యాన్ని వెతకాలని అతని మనస్సు ఎల్లప్పుడూ అతనిని కోరింది.

బౌద్ధ వ్రాతప్రతుల ప్రకారం, సిద్ధార్థ ఒక వృద్ధుడిని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మరియు శవాన్ని చూసినప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అతను అర్థం చేసుకున్నాడు. అతను తన కుటుంబాన్ని, సింహాసనాన్ని మరియు రాజ్యాన్ని వదిలి అడవుల్లో తిరుగుతూ నిజమైన సత్యాన్ని మరియు జీవిత ఉద్దేశాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. అతను 6 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని అంతిమ సత్యాన్ని గ్రహించాడు. అది బీహార్‌లోని బోద్‌గయాలో జరిగింది. అతను 35 ఏళ్లు నిండి, జ్ఞానోదయం పొందాడు. ఆ చెట్టుకు బోధి వృక్ష అని పేరు పెట్టారు. సారనాథ్‌లో జ్ఞానోదయం గురించి తన మొదటి ప్రసంగం చేశాడు.

బుద్దుడు దుఃఖాన్ని, అసలు కారణాన్ని కనుగొన్నాడు. దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే అవిద్యను లేక అజ్ఞానాన్ని తొలగించాలన్నాడు. అవిద్యను నిర్ములించడానికి అష్టాంగమార్గమే సరైనదని బుద్దుడు భోదించాడు.

01.Concept vision mission

Concept • Vision • Mission

Concept (భావన)

భావన – వస్తు భావ పరంపర భావన.
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి,
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం.

Vision (దృష్టి)

సమాజం వసుధైక కుటుంబం యొక్క నమూనా.
తాత్వికులు సమాజంతో మమేకమై, కాలచక్ర పరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

Mission (లక్ష్యం)

Development of Human Relations and Human Resources.
మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి.

Thought

తాత్వికుల భావజాలం కాలాన్ని దాటి సమాజంలో సజీవంగా నిలిచి, మానవ చైతన్యానికి మార్గదర్శకంగా ఉంటుంది.

Quote

“There are no facts, only interpretations.”

— Friedrich Nietzsche

06.బౌద్ధ సాహిత్య గ్రంథాల పేర్లు

బౌద్ధ సాహిత్య గ్రంథాల పేర్లు | Buddha Literature Names List in Telugu

బౌద్ధ ధర్మం ప్రపంచానికి శాంతి, కరుణ, జ్ఞానం అందించిన మహత్తర సంప్రదాయం. బౌద్ధ సాహిత్యం ద్వారా బుద్ధుని బోధనలు, చరిత్ర, తత్వం మరియు నైతిక విలువలు తరతరాలకు చేరాయి. ఈ వ్యాసంలో ముఖ్యమైన బౌద్ధ సాహిత్య గ్రంథాల పేర్లను తెలుసుకుందాం.

త్రిపిటకాలు (Tripitaka)

  • వినయ పిటకం
  • సుత్త పిటకం
  • అభిధమ్మ పిటకం

సుత్త పిటకంలోని నికాయాలు

  • దీర్ఘ నికాయం
  • మధ్యమ నికాయం
  • సంయుక్త నికాయం
  • అంగుత్తర నికాయం
  • ఖుద్దక నికాయం

ఖుద్దక నికాయంలోని ప్రసిద్ధ గ్రంథాలు

  • ధమ్మపదం
  • జాతక కథలు
  • ఉదానం
  • ఇతివుత్తకం
  • సుత్తనిపాతం
  • థేరగాథ
  • థేరీగాథ

ఇతర ప్రసిద్ధ బౌద్ధ గ్రంథాలు

  • మిలింద ప్రశ్నలు
  • మహావంశం
  • దీపవంశం
  • విశుద్ధిమగ్గం
  • బుద్ధచరితం
  • లలితవిస్తరం
  • మహాయాన సూత్రాలు
  • పద్మ సూత్రం
  • హృదయ సూత్రం
  • వజ్ర సూత్రం

ఆధునిక బౌద్ధ గ్రంథాలు

  • బుద్ధుడు మరియు ఆయన ధమ్మం – డా. బి.ఆర్. అంబేద్కర్

బౌద్ధ సాహిత్య ప్రాముఖ్యత

బౌద్ధ సాహిత్యం మనుషులకు నీతి, ధర్మం, కరుణ, సమానత్వం మరియు ఆత్మజ్ఞానం నేర్పుతుంది. ఈ గ్రంథాలు చరిత్ర, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతలో విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి.

ముగింపు

బౌద్ధ సాహిత్య గ్రంథాలు ప్రపంచ మానవాళికి విలువైన జ్ఞాన సంపద. బుద్ధుని బోధనలు తెలుసుకోవాలంటే ఈ గ్రంథాలను అధ్యయనం చేయడం ఉత్తమ మార్గం.

Keywords: బౌద్ధ సాహిత్యం, Buddha Literature, బౌద్ధ గ్రంథాలు, Tripitaka Telugu, Buddha Books Telugu, Buddhist Texts Telugu

02.Relegions

🌍 Overlap World Timeline (Parallel History View)

Different religions & philosophies developed in overlapping time periods


🟤 Zoroastrian Era

c. 1800 – 1200 BCE

0 → Early moral dualism (Good vs Evil)


🟡 Egyptian Civilization (Parallel Start)

c. 3000 – 30 BCE

Pyramids, Pharaoh rule, afterlife belief system


🟠 Vedic Period (Overlaps with early philosophies)

c. 1500 – 500 BCE

Vedas, rituals, dharma foundation


🔵 Judaism (Long continuous tradition)

c. 1200 BCE – Present

Monotheism development


🟣 Greek Philosophy Era

c. 800 – 146 BCE

1 → Ethics & questioning tradition


🟢 Buddhist & Jain Reform Period (India)

c. 600 – 300 BCE

2 → Middle Path, Four Noble Truths

3 → Ahimsa, self-discipline


🔴 Christianity

1st Century CE – Present

4 → Love, forgiveness, salvation


⚫ Islam

7th Century CE – Present

5 → Monotheism, justice, discipline


📌 Key Insight (Important)

These traditions are not isolated — they overlap in time and geography. While one rises, another continues or transforms.

  • Ancient civilizations (Egypt) → early belief systems
  • Philosophical revolution (Greece, India)
  • Monotheistic expansion (Judaism → Christianity → Islam)

02.బౌద్ధ మండలులు (4వ నుండి 6వ వరకు)

🕉️ బౌద్ధ మండలి & త్రిపిటకాలు


𝕀. బౌద్ధ మండలి

బౌద్ధమత చరిత్రలో బౌద్ధ మండలులు (Buddhist Councils) అత్యంత ప్రాముఖ్యమైనవి. బుద్ధుని బోధనలను పరిరక్షించడం, సంఘ నియమాలను క్రమబద్ధీకరించడం, బౌద్ధ గ్రంథాలను సంకలనం చేయడం కోసం ఈ సభలు నిర్వహించబడ్డాయి.

𝟙. మొదటి బౌద్ధ మండలి

గౌతమ బుద్ధుని పరినిర్వాణానంతరం కొద్ది కాలంలోనే మొదటి బౌద్ధ మండలి జరిగింది. మహాకాశ్యపుడు ఈ సభకు నాయకత్వం వహించాడు. 500 మంది సీనియర్ భిక్షువులు పాల్గొన్నారు.

  • ఆనందుడు చెప్పిన బోధనలు — సుత్త పిటకం
  • ఉపాలి చెప్పిన నియమాలు — వినయ పిటకం
  • సంఘ నియమాల క్రమబద్ధీకరణ
  • బుద్ధుని బోధనల పరిరక్షణ

𝟜. నాల్గవ బౌద్ధ మండలి (72 AD)

నాల్గవ బౌద్ధ మండలి క్రీ.శ. 72 ప్రాంతంలో కాశ్మీర్‌లో కుషాణ చక్రవర్తి కనిష్కుని ఆధ్వర్యంలో జరిగింది.

ఈ మండలికి వసుమిత్ర మరియు అశ్వఘోష అధ్యక్షత వహించారు.

ప్రధాన ఉద్దేశ్యం — వివిధ ఆలోచనా పాఠశాలల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం.

ఈ మండలిలో ముఖ్యంగా సర్వాస్తివాదుల అభిధర్మ గ్రంథాలను క్రమబద్ధీకరించి సంస్కృత భాషలోకి అనువదించారు.

ఫలితం — ఈ మండలి తరువాత బౌద్ధమతంలో హీనయాన మరియు మహాయాన విభాగాలు విడిపోయాయి.

𝟝. ఐదవ బౌద్ధ మండలి (1871)

ఈ మండలి మయన్మార్‌లోని మాండలేలో జరిగింది.

ఇది రాజు మిండన్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ మండలికి జాగరాభివంశ, నరిందభిధజ, మరియు సుమంగళసామి అధ్యక్షత వహించారు.

ప్రధాన ఉద్దేశ్యం — బౌద్ధ గ్రంథాలను పఠించడం మరియు వివరంగా పరిశీలించడం.

గమనిక — ఈ మండలికి మయన్మార్ వెలుపల పెద్దగా గుర్తింపు లేదు.

𝟞. ఆరవ బౌద్ధ మండలి (1954)

ఈ మండలి యాంగోన్ (రంగూన్), మయన్మార్‌లో జరిగింది.

ఇది ప్రధాన మంత్రి యు.ను ఆధ్వర్యంలో జరిగింది.

ఈ మండలికి మహాసి సయాదవ్ మరియు భదంత విచిత్తసారభివంశం అధ్యక్షత వహించారు.

ప్రధాన ఉద్దేశ్యం — బౌద్ధ ధర్మం మరియు వినయాన్ని సంరక్షించడం.

ప్రత్యేకత — మొదటి మండలి జరిగిన గుహను పోలి ఒక ప్రత్యేక గుహ నిర్మించబడింది.

𝕀𝕀. త్రిపిటకాలు

బౌద్ధమత ప్రధాన గ్రంథాలను త్రిపిటకాలు (పాళీలో “తిపిటక”) అంటారు. “త్రి” అంటే మూడు, “పిటక” అంటే బుట్టలు. బౌద్ధ బోధనలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి.

  • వినయ పిటక — భిక్షువులు, భిక్షుణిల నియమాలు మరియు సంఘ విధానాలు
  • సుత్త పిటక — గౌతమ బుద్ధుడు బోధించిన సూత్రాలు
  • అభిధమ్మ పిటక — బౌద్ధ తత్వం, మానసిక విశ్లేషణ, ధర్మ వివరణ

త్రిపిటకాలు — బౌద్ధమత జ్ఞాన సంపద.

🧘 సుత్త పిటకంలోని నికాయాలు

  • దీఘ నికాయ
  • మజ్జిమ నికాయ
  • సంయుక్త నికాయ
  • అంగుత్తర నికాయ
  • ఖుద్దక నికాయ

📖 వినయ పిటకంలోని భాగాలు

  • మహావిభంగ
  • భిక్కునీవిభంగ
  • మహావగ్గ

🪔 బౌద్ధ గ్రంథాల అభివృద్ధి

ఈ పిటకాలు మొదట మౌఖికంగా ప్రచారం అయ్యాయి. తరువాత కాలంలో గ్రంథరూపం పొందాయి. అశోకుని కాలానికి కొన్ని భాగాలు ఇప్పటికే ఉన్నాయని శాసనాలు తెలియజేస్తున్నాయి.

థేరవాదులు పాళీ త్రిపిటకాలను బుద్ధుని అసలు బోధనలుగా భావిస్తారు. మహాయాన బౌద్ధంలో సంస్కృతం, చైనా, టిబెటన్ భాషలలో అనేక సూత్రాలు అభివృద్ధి చెందాయి.

👤 ఆచార్య బుద్ధఘోషుడు

ఆచార్య బుద్ధఘోషుడు 5వ శతాబ్దానికి చెందిన ప్రముఖ బౌద్ధ పండితుడు. ఆయన శ్రీలంకలోని అనురాధాపుర మహావిహారంలో పనిచేశాడు. ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం — “విసుద్ధిమగ్గ”.

బుద్ధుని బోధనలు — మానవజాతికి శాంతి, కరుణ, జ్ఞాన మార్గం.

🌍 CONCEPT

Knowledge • Philosophy • Buddhist Thought

🪷 బౌద్ధ మండలులు

Buddhist Councils Timeline

బౌద్ధ ధర్మాన్ని ప్రామాణికంగా నిర్ణయించడానికి మరియు అభివృద్ధి చేసేందుకు నిర్వహించబడ్డ ప్రధాన బౌద్ధ మండలుల పూర్తి క్రమం:


1️⃣ 1వ మండలి | Council of Rajgir

  • సంవత్సరం: క్రీ.పూ. 483
  • స్థలం: రాజగృహ (Rajgir)
  • సభ్యులు: 500 అర్హమైన ఆరియా అరహంతులు (Arahants)
  • ప్రధాన ఉద్దేశ్యం: బుద్ధుని బోధనలు సేకరించడం మరియు రికార్డు చేయడం. వినయ పిటక, సూత్ర పిటకలను సేకరించి, బౌద్ధ ధర్మ శాస్త్రాలుగా రూపాంతరం చేయడం.

2️⃣ 2వ మండలి | Council of Vaisali

  • సంవత్సరం: క్రీ.పూ. 383
  • స్థలం: వైశాలి (Vaisali)
  • సభ్యులు: 700 శ్రావకులు (Followers)
  • ప్రధాన ఉద్దేశ్యం: వాదనల్లో వచ్చిన వివాదాలను పరిష్కరించడం మరియు సూత్ర పిటకపై సమీక్షలు.

3️⃣ 3వ మండలి | Council of Pataliputra

  • సంవత్సరం: క్రీ.పూ. 250
  • స్థలం: పాటలిపుత్రం (Pataliputra)
  • సభ్యులు: అశోక రాజు ఆధ్వర్యంలో 1000+ సభ్యులు
  • ప్రధాన ఉద్దేశ్యం: ధర్మ శుద్ధి, విభేదాల పరిష్కారం మరియు బౌద్ధ గ్రంథాలను స్థిరంగా వ్రాయడం.

4️⃣ 4వ మండలి | Council of Kashmir

  • సంవత్సరం: క్రీ.శ. 1వ శతాబ్దం
  • స్థలం: కాశ్మీర్
  • సభ్యులు: మునుపటి సూత్రాలపై వివరణలు
  • ప్రధాన ఉద్దేశ్యం: బౌద్ధ ధర్మానికి సంబంధించి మరిన్ని వ్యాఖ్యానాలు చేయడం.

5️⃣ 5వ మండలి | Council of Burma

  • సంవత్సరం: 1871
  • స్థలం: మయన్మార్ (Burma)
  • సభ్యులు: 2500+ బౌద్ధ పురోహితులు
  • ప్రధాన ఉద్దేశ్యం: బుద్ధ ధర్మాన్ని శుద్ధీకరించడం మరియు త్రిపిటకాలను రికార్డు చేయడం.

6️⃣ 6వ మండలి | World Buddhist Congress

  • సంవత్సరం: 1954–56
  • స్థలం: యాంగాన్, మయన్మార్
  • సభ్యులు: ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు
  • ప్రధాన ఉద్దేశ్యం: బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేరేపించడం, ముఖ్యంగా థెరవాడ బౌద్ధాన్ని ఉద్ధరించడం.

ప్రతి మండలి బౌద్ధ ధర్మానికి సంబంధించిన ప్రాముఖ్యతను నిర్ధారించింది. ఈ సంఘాలు రాజుల ఆశ్రయం లేకుండానే, బౌద్ధ ధర్మాన్ని ప్రజల మధ్య నిలిపాయి.

🌍 CONCEPT

Buddhist Philosophy • Dharma • Human Knowledge • Spiritual Heritage

02.మగధ సామ్రాజ్యం

మగధ సామ్రాజ్యం | బింబిసారుడు, అజాతశత్రు, Magadha Empire History

🏛️ మగధ సామ్రాజ్యం (Magadha Empire)

బింబిసారుని పాలన

బింబిసారుడు 15 సంవత్సర వయసులో సింహాసనాన్ని అధిష్టించాడు. తూర్పు అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వైద్యుల సహకారం, వివాహ సంబంధాలు, రాజకీయం ద్వారా రాజ్యం స్థిరపరిచాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం, బుద్ధుని మొదటి సమావేశంలో జ్ఞానోదయం పొందాడు.

అజాతశత్రు (492–460 BCE)

బింబిసారుని కుమారుడు, తండ్రిని ఖైదు చేసి పాలన చేపట్టాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం స్త్రీలను బుద్ధుడి మందిరానికి అనుమతించాడు. పాలనలో అనేక యుద్ధాలు, సామ్రాజ్య విస్తరణలు జరిగాయి.

మగధ సామ్రాజ్య రాజవంశాలు

  • Brihadratha dynasty (1700–682 BCE)
  • Pradyota dynasty (682–544 BCE)
  • Haryanka dynasty (544–413 BCE)
  • Shaishunaga dynasty (413–345 BCE)
  • Nanda dynasty (345–322 BCE)
  • Mauryan dynasty (322–184 BCE)
  • Shunga dynasty (184–73 BCE)
  • Kanva dynasty (73–28 BCE)
  • Gupta Empire (240–550 CE)

మగధ సామ్రాజ్య విస్తరణ

6వ మరియు 4వ శతాబ్దం BCE మధ్య హర్యాంక, షైసుంగ, కణ్వ రాజవంశాల క్రింద విస్తరించింది. రాజధానులు: రాజగృహ (గిరివ్రాజ్), తరువాత పాటలీపుత్ర. భాషలు: సంస్కృతం, మాగధీ, అర్ధమాగధి. మతం: హిందూమతం, బౌద్ధమతం, జైనమతం.

హ్యూయెన్ సాంగ్ (Xuanzang)

చైనా యాత్రికుడు, భిక్షువు, విద్యావేత్త. భారతదేశం మరియు దక్షిణాసియాలో సాంస్కృతిక సంబంధాలను పెంపొందించాడు.

  • ధర్మాచరణ – బౌద్ధ ధర్మం తెలుసుకోవడం కోసం యాత్ర
  • యాత్రాభివరణ – 17 ఏళ్లు ప్రయాణం
  • గ్రంథ రచన – Great Tang Records on the Western Regions

ప్రసిద్ధ చక్రవర్తులు

  • బింబిసారుడు
  • అజాతశత్రు
  • శిశునాగ
  • ధన నంద
  • చంద్రగుప్త మౌర్య
  • అశోకుడు
  • సముద్రగుప్తుడు
  • చంద్రగుప్త II

యుద్ధాలు మరియు సైనిక చర్యలు

  • Avanti-Magadhan War
  • Magadha-Vajji war
  • Magadha-Anga war
  • Kalinga War
  • Gupta–Hunnic Wars

మగధ రాజ్యం – బౌద్ధం & జైనమతం

జైన మరియు బౌద్ధమతాల అభివృద్ధిలో మగధ ముఖ్యమైన పాత్ర పోషించింది. పాటలీపుత్రలో రాజశిబిరం నిర్వహించబడింది.

మగధ సామ్రాజ్యం పరిచయం

మగధ రాజ్యం ప్రాచీన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటి. ఇది గంగానది తీర ప్రాంతంలో అభివృద్ధి చెందింది.

మగధ ప్రధాన రాజవంశాలు

  • బృహద్రథ వంశం
  • ప్రద్యోత వంశం
  • హర్యాంక వంశం
  • శిశునాగ వంశం
  • నంద వంశం
  • మౌర్య వంశం
  • శుంగ వంశం
  • కణ్వ వంశం
  • గుప్త సామ్రాజ్యం

మగధ సామ్రాజ్య చరిత్ర

మగధ సామ్రాజ్యం 1700 BCE నుండి 550 CE వరకు భారతదేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించింది. మౌర్యులు మరియు గుప్తుల కాలంలో ఇది అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది.

02.బుద్ధుడు - జీవిత చరిత్ర

బుద్ధుడు - జీవితం మరియు తాత్వికత

🌿 బుద్ధుడు (563 - 483 BCE)

ప్రతిత్యసముత్పాద, పటిచ్చసముప్పద

(కార్యకారణత్వం )

(ఒక దాని కారణంగా మరొకటి జరగడం)

తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం,స్వీయ ప్రభోదాన్ని పొందాడు. ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు.

తన ముందు తరం యొక్క భావాలు భావజాలాల నుండి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి తరువాత తరాల తాత్వికులకు,తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధి గా నిలిచాడు.

📘 బుద్ధుడి జీవిత కథ | Life of the Buddha

1. జననం మరియు శాక్య వంశం | Birth and Shakya Lineage

బుద్ధుడు (గౌతమ బుద్ధుడు) ఇ.సా.పూ. 563 లో లుంబినిలో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు శాక్యుల రాజు. తల్లి మాయాదేవి, జననానికి కొన్ని రోజులకు ముందు మరణించింది.

2. బాల్యం మరియు రాజభవనం | Childhood and Palace Life

బాల్యంలో బుద్ధుడు రాజభవనంలోనే జీవించాడు. బయటి ప్రపంచం యొక్క బాధలు, వేదనలు తెలియకుండా ఉంచబడ్డాడు.

3. నాలుగు దృశ్యాలు | Four Sights

ఒక రోజు బయటికి వెళ్ళి బుద్ధుడు నాలుగు దృశ్యాలను చూశాడు: వృద్ధుడు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తి, మృతదేహం, తపస్వి. ఇవి జీవిత నిస్సారతను తెలియజేశాయి.

4. రాజభవనాన్ని విడిచిపెట్టు | Great Renunciation

29వ ఏట తన భార్య యశోదర మరియు కుమారుడు రాహులను వదిలి బుద్ధుడు రాజభవనాన్ని విడిచాడు.

5. తపస్సు మరియు ధ్యానం | Austerity and Meditation

ఆరేళ్లు తపస్సు చేసిన తర్వాత మాధ్యమ మార్గాన్ని అనుసరించవలసిన అవసరం బుద్ధుడు గ్రహించాడు.

6. బోధి సాధన | Enlightenment

బోధ్ గయలో బోధి వృక్షం కింద ధ్యానం చేసి 35వ ఏట బుద్ధుడయ్యాడు.

7. తొలి బోధన | First Sermon

సార్నాథ్ వద్ద తన తొలి బోధన ఇచ్చాడు — ధర్మచక్ర ప్రవర్తనం.

8. జీవితాంతం మరియు పరినిర్వాణం | Final Days and Parinirvana

80 ఏళ్ల వయస్సులో బుద్ధుడు కుశీనగరంలో పరినిర్వాణాన్ని పొందాడు.

9. ధర్మ పరంపర | Legacy of Teachings

బుద్ధుడు బోధించిన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించింది. బుద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిరత్నాలు బౌద్ధమతానికి కేంద్ర బిందువులయ్యాయి.

26.బౌద్ధం తాత్విక చింతన 1

సమ్మా సతి – అష్టాంగ మార్గం మరియు మైండ్ఫుల్‌నెస్

🌿 అష్టాంగ మార్గం – మూడు శ్రేణులు

కాబట్టి అష్టాంగ మార్గం ని మూడు శ్రేణులుగా ఇలా గుర్తుంచుకోవచ్చు:

✨ శీల – సమాధి – ప్రజ్ఞ

🧠 సమ్మా సతి (Right Mindfulness)

సమ్మా సతి (సరియైన స్మృతి / Right Mindfulness) అష్టాంగ మార్గంలోని సమాధి భాగం లోని ఒక ముఖ్యమైన సాధన.

అర్థం:

“స్మృతి” అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోవడం, అవగాహనలో ఉండటం.

గతంలో మునిగిపోకుండా, భవిష్యత్తు ఆలోచనల్లో మునిగిపోకుండా, ప్రస్తుత క్షణంలో పూర్తి జాగ్రత్తగా ఉండటం.

📘 బౌద్ధంలో సమ్మా సతి

బౌద్ధంలో సమ్మా సతి అంటే:

చతురసతి పఠ్ఠాన (Four Foundations of Mindfulness) మీద జాగ్రత్తగా అవగాహన కలిగించడం.

1. కాయానుపశ్యన – శరీరంపై స్మృతి

శ్వాసపై జాగ్రత్తగా దృష్టి పెట్టడం (ఆనాపాన సతి).

శరీర కదలికలు, నడక, కూర్చోవడం, తినడం మొదలైన వాటిని అవగాహనతో గమనించడం.

2. వేదనానుపశ్యన – అనుభూతులపై స్మృతి

సుఖం, దుఃఖం, తటస్థ భావనలను అవి వచ్చిన క్షణంలోనే గమనించడం.

3. చిత్తానుపశ్యన – మనస్సుపై స్మృతి

కోపం, లోభం, భయం, శాంతి వంటి మనోభావాలను అవి ఉన్నట్లుగానే గుర్తించడం.

4. ధమ్మానుపశ్యన – ధర్మంపై స్మృతి

ధర్మబోధనలను, నిజస్వరూపాన్ని అవగాహన చేయడం.

🌟 ఉపయోగం

మనస్సు చెదరిపోకుండా, మాయలో పడకుండా ప్రస్తుతంలో నిలిపే శక్తి.

క్రమంగా శాంతి, ఏకాగ్రత, జ్ఞానం పెంపొందిస్తుంది.

నిర్వాణానికి దారితీసే బలమైన పునాది.

📌 ముగింపు

“సమ్మా సతి” అంటే మనం ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి అనుభవిస్తున్నామో అవగాహనతో గమనించడం – అదే జాగ్రత్త జీవనం.

26.బౌద్ధ మార్గము శతక పద్యాలు

బౌద్ధ మార్గము శతక పద్యాలు

రచన : Ch రామమోహన్ BA.,


1.

బుద్ధుని వేడెద ధర్మమును వేడెద
సంఘమును వేడెద సరి ఆర్య సత్యములు
పంచశీల సూత్రములు అష్టాంగ మార్గములు

2.

దశ పారమితల దరి చేరుము
మనసున ఎరుకతో మసలుము
ధ్యాన మార్గమున ధన్యజీవులు

3.

అనిత్య అనాత్మ శోధించు సుగతుడు
ప్రతీత్య సముత్పాద బోధించు ధర్మచక్ర ప్రవర్తకుడు
సమ్యక్ సమ్బుద్ధుడు సహనశీలుడు

4.

వస్తు భావ పరంపర భావన
భావజాల ప్రగతి జగతి మూలం
ఎంచి చూచిన అవగతమగును

5.

బుద్ధుని నియమబద్ధుని గౌతముని గొలిచెద
మనసు వికసించున్ మౌన మార్గమున
జ్ఞాన దీపములు జాగృతమగున


© 2026 బౌద్ధ మార్గము శతక పద్యాలు | రచన : Ch రామమోహన్ BA.

02. నాగార్జునుడు

ఆచార్య నాగార్జునుడు ఎవరు? | Nagarjuna Philosophy | Mahayana Buddhism

భారతీయ తత్వ చరిత్రలో ఒక కీలక మలుపు


ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు) (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది.

ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.

భారతీయ తత్వ చరిత్రలో ఒక కీలక మలుపు

అశ్వఘోషుడితో భారతదేశంలో గ్రంథ రచయిత అనే వ్యక్తిగత గుర్తింపు సాధారణ శకం 1వ శతాబ్దంలో స్పష్టంగా కనిపించింది. అతని తర్వాత భారతీయ ఆలోచనా చరిత్రలో మరింత పెద్ద మలుపు తిరిగింది. ఆ మలుపు పేరు ఆచార్య నాగార్జునుడు.

ఆచార్య నాగార్జునుడు రాజు కాదు. శిలాశాసనాలు రాయించలేదు. కావ్యాలు కూడా రాయలేదు. అతను చేసిన పని ఆలోచనలను, తర్కాన్ని మరియు విమర్శను తత్వశాస్త్ర గ్రంథాల రూపంలో రాయడం.

ఆచార్య నాగార్జునుడి కాలం

చరిత్ర పరిశోధన ప్రకారం నాగార్జునుడు సాధారణ శకం 2వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కాలం కుషాణ చక్రవర్తుల కాలం.

ఈ దశలోనే భారతదేశంలో తత్వ చర్చలు మౌఖికంగా కాకుండా గ్రంథ రూపంలో స్థిరపడ్డాయి.

నాగార్జునుడి ప్రధాన గ్రంథాలు

  • మూలమధ్యమక కారిక – మధ్యమిక తత్వశాస్త్రానికి ప్రాథమిక గ్రంథం
  • విగ్రహవ్యావర్తని – విమర్శలకు నాగార్జునుడు ఇచ్చిన తాత్విక సమాధానం
  • యుక్తిషష్టికా – తర్కం ఆధారంగా తత్వాన్ని విశ్లేషించే రచన
  • శూన్యతసప్తతి – శూన్యత సిద్ధాంతాన్ని వివరించే గ్రంథం
  • వైదల్యప్రకరణ – తర్క లోపాలను గుర్తించే విమర్శాత్మక గ్రంథం

నాగార్జునుడికి ఆపాదించబడిన ఇతర గ్రంథాలు

  • రత్నావళి
  • సుహృల్లేఖ
  • ప్రజ్ఞాపారమితాస్తవ
  • ధర్మధాతుస్తవ
  • బోధిచిత్తవివరణ

ఈ గ్రంథాలు తరువాతి కాలాల్లో నాగార్జునుడి పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. అతనే రాశాడని పూర్తిగా నిర్ధారణ లేదు.

నాగార్జునుడి తత్వం ఎందుకు ముఖ్యమైనది?

నాగార్జునుడి గ్రంథాల్లో దేవతల కథలు లేదా పూజా విధానాలు కనిపించవు. ఇక్కడ ప్రధానంగా కనిపించేది మనిషి ఆలోచన, తర్కం, సందేహం మరియు విమర్శ.

అందువల్ల నాగార్జునుడు కేవలం మత ప్రచారకుడు కాదు. అతను ఒక గొప్ప తత్వ రచయిత.

తెలుగు నాగార్జునుడు ఎవరు?

చరిత్రలో “తెలుగు నాగార్జునుడు” అనే వ్యక్తి గురించి ఖచ్చితమైన శాసన ఆధారం ఇప్పటివరకు లభించలేదు.

అతను మహాయాన తత్వ రచయిత నాగార్జునుడు కాదు.

తెలుగు నాగార్జునుడి రంగం

  • రసవాదం
  • లోహ శాస్త్రం
  • సిద్ధ సంప్రదాయం
  • ఆయుర్వేద ప్రయోగాలు

కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది?

  • నాగార్జున అనే పేరు వేర్వేరు వ్యక్తులకు ఉండటం
  • నాగార్జునకొండ ప్రాంతాన్ని తత్వ రచయితతో కలపడం
  • రసవాద గ్రంథాలను అదే నాగార్జునుడికి ఆపాదించడం

ముగింపు

కుషాణ కాలపు నాగార్జునుడు మహాయాన బౌద్ధ తత్వ రచయితగా చరిత్రలో బలంగా నిర్ధారించబడ్డాడు.

తెలుగు నాగార్జునుడు మాత్రం రసవాద సంప్రదాయానికి చెందినవాడిగా గ్రంథాల ఆధారంగా మాత్రమే గుర్తించబడుతున్నాడు.

పేరు ఒకటే కానీ కాలం, రచనలు, చారిత్రక ఆధారాలు వేరు.

Collection – Rama Mohan Chinta

21.బుద్ధుడు మరియు అష్టాదశ పురాణాలు

🧘 బుద్ధుడు మరియు అష్టాదశ పురాణాలు

Buddha and the Eighteen Mahapuranas | Indian Philosophy | Ancient Literature


బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దంలో జీవించాడు. కానీ అష్టాదశ మహాపురాణాలు అనేక శతాబ్దాల తరువాత రూపుదిద్దుకున్నాయి. అందువల్ల బుద్ధుని కాలంలో ఇవి పూర్తి రూపంలో లేవు.

📚 అష్టాదశ మహాపురాణాలు

  1. బ్రహ్మ పురాణం
  2. పద్మ పురాణం
  3. విష్ణు పురాణం
  4. వాయు పురాణం
  5. భవిష్య పురాణం
  6. భాగవత పురాణం
  7. నారద పురాణం
  8. మార్కండేయ పురాణం
  9. అగ్ని పురాణం
  10. లింగ పురాణం
  11. వరాహ పురాణం
  12. స్కంద పురాణం
  13. వామన పురాణం
  14. కూర్మ పురాణం
  15. మత్స్య పురాణం
  16. గరుడ పురాణం
  17. బ్రహ్మాండ పురాణం
  18. బ్రహ్మవైవర్త పురాణం

✨ పురాణాల ముఖ్య లక్షణాలు

  • సృష్టి (Creation)
  • ప్రళయం (Dissolution)
  • దేవతల వంశావళి
  • రాజవంశాల చరిత్ర
  • ధర్మం మరియు ఆచారాలు

⏳ టైమ్‌లైన్

  • క్రీ.పూ. 500 – 100 → ప్రారంభ వచనాలు
  • క్రీ.శ. 100 – 500 → ప్రాథమిక రూపం
  • క్రీ.శ. 500 – 1200 → విస్తరణ
  • క్రీ.శ. 1200 – 1500 → తుది సంపుటీకరణ

📖 కొన్ని ముఖ్య పురాణాలు

  • విష్ణు పురాణం: సృష్టి, అవతారాలు
  • భాగవత పురాణం: శ్రీకృష్ణుడు, భక్తి మార్గం
  • లింగ పురాణం: శివ తత్వం
  • స్కంద పురాణం: క్షేత్ర మహత్యాలు

🔍 ఎలా అర్థం చేసుకోవాలి?

పురాణాలను పూర్తిగా చారిత్రక గ్రంథాలుగా కాకుండా సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రతిబింబంగా చూడాలి.

📌 Conclusion

బుద్ధుడు ఒక గొప్ప తత్వవేత్త. కానీ అష్టాదశ పురాణాలు ఆయన తరువాతి కాలంలో అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ రెండు వేర్వేరు సంప్రదాయాలు.

03.బుద్ధుడు ప్రతిత్య సముత్పాదం

🪷 ప్రతీత్య సముత్పాదం (Pratītyasamutpādam)

Dependent Origination in Buddhism | Buddhist Philosophy | Cause and Effect


📚 Concept of Bouddham

బౌద్ధం మనిషి జీవిత సమస్యలకు తాత్విక పరిష్కారం చూపిస్తుంది. బుద్ధుడు చెప్పిన నాలుగు ఆర్యసత్యాలు మరియు అష్టాంగిక మార్గం ద్వారా మనిషి దుఃఖానికి కారణాలను తెలుసుకుని విముక్తి పొందవచ్చు.

🔍 Meaning of Pratītyasamutpādam

ప్రతీత్య సముత్పాదం అంటే “పరస్పర ఆధారంతో ఉద్భవించడం” (Dependent Origination).

ప్రపంచంలోని ప్రతి విషయం కారణ–ఫల సంబంధంతో ఏర్పడుతుంది. ఏదీ స్వతంత్రంగా ఉనికిలో ఉండదు.

ఒక విషయం ఉండటానికి మరొక విషయం కారణం అవుతుంది. దీనిని బౌద్ధంలో ద్వాదశ నియమాలు (Twelve Links) గా వివరించారు.

✨ Benefits of Understanding

  • జీవితం యొక్క కారణ–ఫల సంబంధం అర్థమవుతుంది
  • మనస్సులో శాంతి మరియు స్పష్టత పెరుగుతుంది
  • దుఃఖానికి మూల కారణాలు తెలుసుకోవచ్చు
  • ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది

🧘 బుద్ధుని సందేశం

“యదిదం ప్రతీత్య సముత్పాదం – ఇదే ధర్మం.” – బుద్ధుడు

🌿 Philosophical Insight

ప్రతీత్య సముత్పాదం బౌద్ధ తత్వంలో అత్యంత ముఖ్యమైన భావన. ఇది ప్రపంచాన్ని శాశ్వతమైనదిగా కాకుండా పరస్పర సంబంధాల సమాహారంగా చూడమని సూచిస్తుంది. జీవితం మార్పులతో నిండి ఉందని, ప్రతి అనుభవం కారణాలతో ఏర్పడుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది.


Buddhist Philosophy | Pratītyasamutpādam | Dependent Origination | Bouddham | Telugu Spiritual Knowledge

26.భారత రాజవంశాలు

భారత రాజవంశాలు (2000 BCE - 100 CE)

1. హరప్పా – సింధు నాగరికత (2600 - 1900 BCE)

రాజులు లేరు – నగర సమాజం ఆధారిత పాలన

2. వేద కాలం (1500 - 600 BCE)

గణ రాజ్యాలు – కురులు, పంచాళులు, యదువులు, భరతులు

3. మహాభారత యుగం

కౌరవులు – పాండవులు (కురు వంశం), యదు వంశం, ఇక్ష్వాకు వంశం

4. మహాజనపదాలు (600 - 300 BCE)

  • మగధ – హరిణ్యక, శిశునాగ, నంద
  • కోశల, అవంతి, వత్స, లిఛ్ఛవులు

5. మౌర్య వంశం (322 - 185 BCE)

చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు – బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన చక్రవర్తులు

6. శుంగ వంశం (185 - 75 BCE)

పుష్యమిత్ర శుంగుడు – మౌర్యుల అనంతరం

7. కన్వ వంశం (75 - 28 BCE)

వసుదేవుడు – చివరి బ్రాహ్మణ వంశం

8. శకులు, యవనులు (200 BCE - 100 CE)

గ్రీకు, పార్థియన్ శాసకులు – మిలిందుడు

9. సాతవాహన వంశం (100 BCE - 200 CE)

దక్షిణ భారతదేశపు మొదటి గొప్ప వంశం – గౌతమిపుత్ర శాతకర్ణి


అఖండ భారతం – చారిత్రక వ్యక్తులు (Years)

  • గౌతమ బుద్ధుడు – 563–483 BCE
  • అజాతశత్రు – 492–460 BCE
  • ఉదాయినుడు – 460–440 BCE
  • బహుబలి – జైన్ ఇతిహాస పాత్ర
  • అమ్రపాలి – సుమారు 500 BCE
  • సిసునాగుడు – 412–393 BCE
  • కాళాశోకుడు – 367–344 BCE
  • ధనానందుడు – సుమారు 329 BCE
  • చాణక్యుడు – 350–275 BCE
  • చంద్రగుప్త మౌర్యుడు – 340–297 BCE
  • బింబిసారుడు – 544–492 BCE
  • బిందుసారుడు – 320–273 BCE
  • అలెగ్జాండర్ – 356–323 BCE
  • సెల్యూకస్ – 358–281 BCE
  • మెగస్థనీస్ – 302–288 BCE
  • విశాఖదత్తుడు – సుమారు 4వ శతాబ్దం CE

చారిత్రక గ్రంథాలు (Texts & Literature)

  • మహావంశం – 5వ శతాబ్దం CE
  • ముద్రారాక్షసం – 4వ శతాబ్దం CE
  • జైన్ గ్రంథాలు – 600 BCE – 300 CE
  • బౌద్ధ గ్రంథాలు – 500 BCE – 100 BCE
  • తమిళ గ్రంథాలు – 300 BCE – 300 CE
  • గ్రీకు గ్రంథాలు – 300 BCE – 100 CE

ఋగ్వేద కాల నదులు – నేటి పేర్లతో

  • సరస్వతి – హక్రా / ఘఘర్ నది
  • సింధు – ఇండస్ నది
  • వితస్తా – జెలం (Jhelum)
  • అసిక్ని – చెనాబ్ (Chenab)
  • పరుష్ణి – రవి (Ravi)
  • శుతుద్రి – సుత్లజ్ (Sutlej)
  • యమునా – యమునా
  • గంగా – గంగా
  • సరయూ – ఘఘరా నది
  • కుబ్హా – కబూల్ నది
  • క్రము – కుర్రం నది
  • దృష్ట్వతి – ఢిల్లీ ప్రాంతపు ఉపనది
  • త్రిత్సు – గుర్తు తెలియని చిన్న నది

16 మహాజనపదాలు – Modern Locations

  • అంగ (Anga): East Bihar
  • మగధ (Magadha): South Bihar
  • వజ్జి (Vajji): North Bihar (Vaishali)
  • మల్ల (Malla): Gorakhpur & Deoria, UP
  • కాషి (Kasi): Varanasi, UP
  • కోశల (Kosala): Eastern UP (Ayodhya)
  • చేది (Chedi): Bundelkhand (MP & UP)
  • వత్స (Vatsa): Allahabad, UP
  • కురు (Kuru): Delhi, Haryana
  • పాంచాల (Panchala): Western UP (Bareilly)
  • మత్స్య (Matsya): Jaipur, Rajasthan
  • సురసేన (Surasena): Mathura, UP
  • అశ్మక (Asmaka): Telangana & Maharashtra (Godavari)
  • అవంతి (Avanti): Malwa region, MP (Ujjain)
  • గంధార (Gandhara): Afghanistan & NW Pakistan (Peshawar)
  • కాంబోజ (Kamboja): North Pakistan & Kashmir